మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఒక్కరూ తడి, పొడి చెత్తలను వేరుచేసి ఇవ్వాలని మునిసిపల్ కమిషనర్ నరసింహరెడ్డి తెలిపారు. గురువారం పులివెందుల పట్టణంలోని ఆయన పలు వార్డులలో పర్యటించి మాట్లాడారు. రోడ్డుపై చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తడి, పొడి చెత్తను వేరుచేసి పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలన్నారు. రోడ్డుపై నిల్వ ఉన్న నీటిని వెంటనే తొలగించాలని సిబ్బందికి సూచించారు. రాత్రిపూట ఇష్టానుసారంగా రోడ్డుపై చెత్తను వేసే అంగళ్లపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే పలు హోటళ్లను పరిశీలించి శుభ్రత పాటించాలని ప్రభుత్వం నిషేధిత ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిషేధించాలన్నారు.