వెల్లుల్లి నూనెతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లి రెబ్బలను బాగా దంచి ఆలివ్ ఆయిల్ లో మీడియం మంటపై 5-8 నిమిషాలు వేయించాలి. చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసి గాలి చొరబడని పాత్రలో నిల్వ చేసుకోవాలి. చర్మ సమస్యలున్న చోట ఈ నూనె రాస్తే పరిష్కారం అవుతాయని పేర్కొంటున్నారు. స్నానం చేసే నీటిలో కొద్దిగా ఈ నూనె వేసుకుని స్నానం చేస్తే జలుబు, దగ్గు వంటి రుగ్మతలు దరి చేరవని చెబుతున్నారు.