ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ ఆరో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నుండి గుడివాడ అమర్‎నాథ్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 03, 2023, 02:41 PM

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‎నాథ్ కు విశాఖ ఆరో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కమ్ రైల్వే న్యాయస్థానం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. రైల్వే స్టేషన్‎లోకి అనధికారికంగా ప్రవేశించారని ఐదేళ్ల కిందట అమర్‎నాథ్ పై కేసు నమోదైంది. 2018లో ప్రత్యేక హోదా, రైల్వే జోన్ డిమాండ్ చేస్తూ స్టేషన్‎లోకి అనధికార ప్రవేశం చేశారు. విశాఖ-పలాస ప్యాసింజర్‌ రైలును నిలిపేసి రైల్‌రోకో నిర్వహించారు. దీంతో గుడివాడ అమర్‎తో పాటు పలువురు వైసీపీ నేతలు ఉన్నటు రైల్వే అధికారులు గుర్తించారు. విచారణ‎లో భాగంగా నిందితులు ఫిబ్రవరి 27న న్యాయ స్థానంలో హాజరు అవ్వాలి. కానీ..గుడివాడ అమర్‎నాథ్, జాన్ వెస్లీలు కోర్ట్‎కి హాజరు కాకపోవడంతో నాన్ బెయిల్ అరెస్ట్ వారంటీ జారీ కేసును మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com