ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్ అత్యుత్సాహం ప్రదర్శించింది. అనంతపురం జిల్లా, కంబదూరు ప్రభుత్వ పాఠశాల, సచివాలయంలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదంటూ జిల్లా విద్యాశాఖధికారి ఆదేశాలను భేఖాతరు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల రంగంలోకి నేరుగా మంత్రులు నేతలకు టార్గెట్లు ఇచ్చిన్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. క్షేత్రస్థాయిలో ఎంపీ, ఎమ్మెల్యేలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. బ్యాలెట్ బాక్స్‌ల భద్రత, సా్ట్రంగ్ రూమ్ ఎంపిక, ఓట్ల లెక్కింపునకు అవసరమయ్యే గదులు, వసతులు, బారికేడ్ల ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కమిషన జారీ చేసిన సూచనల మేరకు కౌంటింగ్ పక్కాగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.