పెంచిన గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించాలంటూ కర్నూలు జిల్లా, కౌతాళంలో వాల్మీకి సర్కిల్‌లో సీపీఎం నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకుడు మల్లయ్య మాట్లాడుతూ.... పేదల ప్రజల జీవితాలను గట్టెక్కిస్తానని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రధాని ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ప్రజల జీవితాలను నాశనం చేశారని విమర్శించారు. 2014లో గ్యాస్ ధర రూ.410 ఉంటే ప్రస్తుతం రూ.1155కు పెంచి ప్రజల నడ్డి విరిచారని మండిపడ్డారు. ఈ తొమ్మిదేళ్ల పాలనలో ఏకంగా 745 రూపాయలను పెంచిన ఘనత బీజేపీకే దక్కుతుందని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను తగ్గించకపోతే దేశవ్యాప్తంగా ధర్నాలు చేపడతామని హెచ్చరిం చారు. కార్యక్రమంలో సీపీఎం మండల కన్వీనర్ మేలిగిరి ఈరన్న, కార్యక ర్తలు మారయ్య, వీరేష్, తాయప్ప, జగ్గప్ప పాల్గొన్నారు.