టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మృతిపట్ల మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు సంతాపం తెలిపారు. బచ్చుల అర్జునుడు మృతి విచారకరమన్నారు. మున్సిపల్ ఛైర్మన్గా, కృష్ణా జిల్లాపార్టీ అధ్యక్షుడిగా, శాసనమండలి సభ్యుడిగా, పార్టీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్గా అర్జునుడు సేవలు ప్రశంసనీయమన్నారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా, వారి సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేశారని తెలిపారు. అర్జునుడు మృతితో తెలుగుదేశంపార్టీ ఒక క్రమశిక్షణ గల సైనికుడిని కోల్పోయిందని ఆవేదన చెందారు. ఆయన మృతి కృష్ణాజిల్లాకే కాదు, తెలుగుదేశం పార్టీకి తీరనిలోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్ధిస్తూ... అర్జునుడు కుటుంబ సభ్యులకు కంభంపాటి రామ్మోహన్ తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.