కడప నగరం శంకరాపురంకు చెందిన కోలా మల్లిఖార్జున 2006లో కడప ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్‌లో ఓడీగా తనకున్న చిన్నచౌకు రాజానగర్‌లోని 19 సెంటు స్థలాన్ని బ్యాంకుకు తనఖా పెట్టి రూ.10లక్షలు తీసుకున్నాడు. అనంతరం సదరు ఓడి విషయం బ్యాంకుకు తెలపకుండానే ఆ స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఇతరులకు అమ్మాడు. అమ్మిన ఆ ఆస్తిని నకిలీ డాక్యుమెంట్లుతో దోగా యుగంధర్, అతని స్నేహితులకు రూ.50లక్షలకు అమ్మి.. వారికి రిజిస్టరు చేయించి సొమ్ము చేసుకున్నాడు. నకిలీ డాక్యుమెంట్ల ద్వారా రిజిస్టరు చేయించిన విషయం తెలుసుకున్న యుగంధర్ 2019లో చిన్నచౌకు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అప్పటి ఎస్‌ఐ సత్యనారాయణ కేసు నమోదు చేశారు. ఈవిషయమై గురువారం కడప రెండో అదనపు మెజిసే్ట్రట్ కోర్టు జడ్జి షేక్ రియాజ్‌బాషా కేసును విచారించి.. రెండేళ్లుజైలు శిక్ష, రూ.2100 జరిమానా విధించినట్లు చిన్నచౌకు పోలీసులు తెలిపారు.