రాయచోటి పట్టణంలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ఉప విద్యాశాఖ, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో ఏపీ చైల్డ్ రైట్స్ కమిషన సభ్యురాలు లక్ష్మిదేవి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..... పదవ తరగతి పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలన్నారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 123 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని.. 22,395 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఆయా పరీక్షా కేంద్రా ల్లో కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో రాయచోటి డీవైఈవో వరలక్ష్మి, సహాయ సంచాలకులు నరసింహులు, సూపరిండెంట్ రవికుమార్, పరీక్షల విభాగం సీనియర్ అసిస్టెంట్ రమేష్, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.