హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం అంబాలా వద్ద జాతీయరహదారిపై ఓ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం ధాటికి బస్సు నుజ్జునుజ్జు అయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa