పవిత్ర వారణాసిలో ఓ ప్రసిద్ధ ఆలయం ఉంది. ఈ ఆలయంలో భైరవ్ నాథ్ పేరిట దేవుడు నిత్యం పూజలందుకుంటాడు. అయితే ఈ ఆలయానికి ఓ విశిష్టత ఉంది. ఇక్కడ దేవుడిని నైవేద్యంగా మద్యం పోస్తారు. అది కూడా విస్కీ లేదా వైన్ మాత్రమే. విగ్రహం నోట్లో ఆ మద్యాన్ని పోసి దాన్నే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ ఆలయం వెలుపల రకరకాల మద్యం సీసాలను అమ్ముతుంటారు.