అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు మాస్టర్ ప్లాన్‌లో అవకతవకలపై ఏపీ మాజీ మంత్రి నారాయణ దంపతుల కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు విచారణకు హాజరుకావాలని ఈనెల 6న నారాయణ దంపతులు సహా కంపెనీ ఉద్యోగి ప్రమీలకు సీఐడీ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపున మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించగా.. హైకోర్టు వాటిని పరిగణలోకి తీసుకుని విచారణ ఇంటి దగ్గరే చేయాలని ఆదేశాలిచ్చింది.