కౌతాళం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విజయానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జీ తిక్కారెడ్డి కోరారు. శనివారం కౌతాళంలో రైతు సంఘం నాయకులు చెన్నబసప్ప గౌడ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని రంగాల్లో విఫలం చెందారని విమర్శించారు. జాబ్ క్యాలెండరు పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో యువతను మోసం చేశారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువతను ఓటు అడిగే హక్కు జగన్ కు లేదని ఆరోపించారు. యువత మేలుకోవాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు భీమవరం కోళ్ల నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.