గుంటూరు జిల్లా, తుళ్ళూరు మండలం ఉద్దండరాయిని గ్రామంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో శుక్రవారం అర్ధరాత్రి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో 13 మంది జూదరులను అదుపులో తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు లక్షల 12 వేల రూపాయల నగదు 14 సెల్ ఫోన్లు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనంతరం వారిని తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తుళ్ళూరు సిఐ ఆనందరావు తెలిపారు.