ఓబుళదేవరచెరువు మండలంలో ఓబుళరెడ్డిపల్లికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తికి శుక్రవారం కదిరి జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ సివిల్ మెజిస్ట్రేట్ ప్రతిమ సంవత్సరం జైలు శిక్ష, రూ. 2 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. 2018లో ఓడీసీ మండలానికి చెందిన ఒక యువతిపై శ్రీనివాసులు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అందిన ఫిర్యాదుపై అప్పటి ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి కేసు నమోదుచేసి విచారణ చేశారు. దీనిపై కోర్టులో విచారణ జరగ్గా. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి తీర్పు ప్రకటించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లుగా ఖాదర్ బాషా, లక్ష్మిసాయి కేసును వాదించినట్లు ఎస్ఐ గోపి, కానిస్టేబుల్ కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.