సీఎం జగన్మోహనరెడ్డి మార్చి 5న ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాలోని కలగంపూడి రానున్నారు. గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటనకు చేస్తున్న ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రవిప్రకాష్, జిల్లా ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ ఎం.సూర్యతేజలు శుక్రవారం పరిశీలించారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ అధికారులకు ఆదే శాలిచ్చారు. ప్రభుత్వ చీఫ్‌విప్, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కుమార్తె వివాహానికి సీఎం హాజరుకానున్నారు. పర్యటనలో ఎక్కడా ఏ చిన్నపొరపాటు దొర్లకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూర్యతేజ సూచించారు. తహసీల్దార్ ఎల్.నర్శింహరావు, ఎంపీడీవో త్రిశూలపాణి ఉన్నారు.