ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదోతరగతి విద్యార్థులకు ఈ నెల 9 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఎఫ్‌ఏ-4, పదోతరగతి విద్యార్థులకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
- ప్రాథమిక స్థాయిలో 3,4,5 తరగతుల విద్యార్థులకు 9న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఓఎస్‌ఎస్‌సి పరీక్ష నిర్వహిస్తారు. 10న తెలుగు, గణితం, 14న ఇంగ్లీషు, పరిసరాల విజ్ఞానం పరీక్షలు జరుగుతాయి.
- 6,7,8 తరగతులకు మధ్యాహ్నం 1.30 నుంచి రెండు పరీక్షలు నిర్వహిస్తారు. 9న ఓఎస్‌ఎస్‌సి-1, -2 , 10న తెలుగు, గణితం, 14న హిందీ, జనరల్‌సైన్స్, 15న ఇంగ్లీషు, సోషల్ పరీక్షలు జరుగుతాయి
- తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి 11.45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. 9న ఓఎస్‌ఎస్‌సీ, 10న తెలుగు, గణితం, 14న హిందీ, జనరల్‌సైన్స్, 15న ఇంగ్లీషు, సోషల్ పరీక్షలు జరుగుతాయి.
- పదోతరగతి విద్యార్థులకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారు. 9న ప్రథమ భాష, ప్రథమ భాష కాంపోజిట్ కోర్సుపేపర్-1, 10న ద్వితీయ భాష, 14న ఇంగ్లీషు, 15న గణితం, 16న సైన్స్, 17న సోషల్, 18న కాంపోజిట్ కోర్సు పేపర్-2, ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ పేపరు-1, 20న ఓఎస్‌ఎస్‌సి మెయిన్ లాంగ్వేజీ పేపరు-2 పరీక్షలు నిర్వహిస్తారు.