గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం ఇప్పటం అంటే రాష్ట్రము మొత్తం తెలిసేలా చేసిన ఘనత జనసేన పార్టీకి అలానే పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ కి చెందుతుంది. ఐతే ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో నోటీసులు ఇచ్చిన 8 కట్టడాలను తొలగించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఇప్పటంలో పోలీసులు భారీగా మోహరించారు. అయితే కూలీ నాలీ చేసుకుని కట్టుకున్న ఇళ్లు కళ్ల ముందే కూల్చేస్తుండటంతో గ్రామస్తులు కన్నీటిపర్యంతమవుతున్నారు. తమ ఆవేదనను పట్టించుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa