నరసరావుపేట: ఆర్టీసీ డిపోకు నూతనంగా మంజూరైన 2 పల్లె వెలుగు బస్సులను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శనివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్నాడు జిల్లా కేంద్రంగా నరసరావుపేట ఏర్పడ్డ అనంతరం వివిధ పనులపై ఇక్కడికి వచ్చే ప్రజల రాకపోకలు పెరిగాయని అన్నారు. ఈ నేపథ్యంలో నరసరావుపేట-గుంటూరు రూట్ లో రెండు పల్లె వెలుగు నూతన సర్వీస్ లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.