గ్యాస్ రేట్లు పెంచి సామాన్య మహిళలపై పెనుభారం మోపి, ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కడం దుర్మార్గమని టీడీపి మహిళ నేతలు అన్నారు. శనివారం తెనాలి టిడిపి విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు పరుచూరి రమ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరికి ఏ విధమైన సమస్యలు , ఇబ్బందులు కలిగినా వాటిని పరిష్కరించవలసిన భాధ్యత ముఖ్యమంత్రిదే అని, నిత్యావసరాల రేట్లు పెరిగినా ప్రజలు అడిగేది ముఖ్యమంత్రినే అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. కేంద్రానికి సంబందించిన విషయమని తప్పుకోవడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రానికి సంబంధించి వైసీపీ తరుపున 22 మంది పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు అన్న విషయం సీఎం కు తెలుసా అని ప్రశ్నించారు. గ్యాస్ రేట్లు పెరిగితే ఎంపీలు ఏమి చేస్తున్నారని అన్నారు.