ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ...ఇరు పార్టీల మధ్య మొదలైన దాడులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 05, 2023, 06:08 PM

ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లు సాగుతున్న పరిస్తితి కాస్త భౌతిక, ఆస్తులపై దాడిగా పరిణమిస్తోంది. ఇదిలావుంటే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర.. 35వ రోజు కొనసాగుతోంది. అయితే.. లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో.. కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా.. గడ్డివాము దగ్ధం కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం గూడూరుపల్లెకు చెందిన బయ్యన్న కుమారుడు బి.గోపాల్‌, వెంకటరామన్న కుమారుడు వెంకటరెడ్డికి చెందిన.. రెండు గడ్డివాములకు దుండగులు నిప్పుపెట్టారు. అయితే.. గోపాల్‌, వెంకటరెడ్డి..నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో పాల్గొన్నారని.. ఆ కారణంగానే నిప్పుపెట్టి ఉండవచ్చని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


ఇటు యువగళం పాదయాత్రపై పోలీసులు రెండు రోజులకు ఒక కేసు బనాయిస్తున్నారని.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. 33 రోజుల్లో 15 అక్రమ కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు. 'పోలీసులను అడ్డుపెట్టుకొని పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారు. పాదయాత్రకు మద్దతు తెలపడానికి వస్తున్న ప్రజల్నీ ఇబ్బందులు పెడుతున్నారు. చివరికి జగన్‌కు, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నాయకులపైనా అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు' అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.


'ఎన్నికల అఫిడవిట్‌లో టీడీపీ అభ్యర్థులు తమపై నమోదైన కేసుల వివరాల్ని నమోదు చేయాలంటే ఆ వివరాలూ తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది. టీడీపీ నేతలపై ఏ పోలీస్‌స్టేషన్‌లో ఎన్ని కేసులు పెట్టారో కూడా తెలియదు. భవిష్యత్తులో కేసుల వివరాల్ని తప్పుగా నమోదు చేశామని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసి.. టీడీపీ వాళ్ల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యేలా చేయాలని కుట్రలు పన్నుతున్నారు. ఇంతకంటే దిగజారుడు రాజకీయం మరొకటి ఉండదు' అని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com