రేపల్లె కాల్వలో స్నానం చేయడానికి దిగి ప్రమాదవశాత్తు వ్యక్తి మునిగి చనిపోయిన సంఘటన ఆదివారం అన్నవరం గ్రామంలో చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం అన్నవరం గ్రామంలో బంధువులతో రేపల్లె కాలువలో స్నానం చేస్తూ ఉండగా అన్నవరం గ్రామానికి చెందిన తాతా గోవిందు కాళ్లకు లుంగీ అడ్డుపడటంతో మునిగి పోయినట్లు తెలిపారు. మృతుడు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు. ఇతనికి గతంలో భార్య చనిపోయినట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు