ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుమానిత ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 06, 2023, 10:10 AM

గంజాయి మత్తు పదార్థాలను విక్రయాలు నిర్వహించిన, వినియోగించిన చట్టరీత్య తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రవీంద్రారెడ్డి హెచ్చరించారు. కొల్లూరు మండల పరిధిలోని గ్రామాలలో పలు అనుమానిత ప్రాంతాలలో గంజాయి అమ్మకం, వినియోగంపై జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదేశాల మేరకు ఆదివారం ఆర్ రవీంద్రారెడ్డి సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి మత్తు పదార్థాలకు యువత బానిస అవుతున్నారని అన్నారు. మొత్తు పదార్థాలు సేవించి జీవితాలను నాశనం చేసుకోవద్దని చెప్పారు. మత్తు పదార్థాలు విక్రయించిన, వినియోగించిన ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అలాంటి వారిపై నిఘ ఎప్పుడూ ఉంటుందని ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని వివరాలు అందించిన వారినీ గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ ఆర్ రవీంద్రారెడ్డి కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com