మందస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం వృత్తి విద్యా కోర్సుల వర్క్ షాప్ జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా పాతపట్నం జూనియర్ కళాశాల కామర్స్ అధ్యాపకులు విషయ నిష్ణాతులు బి. టి. వి. మంగపతి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వృత్తి విద్య వలన ఎన్నెన్నో అవకాశాలు పొందవచ్చునని, ఉద్యోగ అవకాశాలు ఎంతో మెండుగా ఉన్నాయన్న విషయాన్ని తెలియజేశారు. భవిష్యత్తులో విద్యార్థులు ఇటువంటి కోర్సులు పూర్తి చేసిన వారు ఎటువంటి అవకాశాలు పొందగలరో తెలియజేశారు. ఇలాంటి కోర్సులు వినియోగించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు కోరారు. ఈ వేదికకు అధ్యక్షులుగా ప్రిన్సిపాల్ చింతాడ శరత్ బాబు వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సేవలను కొనియాడుతూ సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు నరేష్, దుర్యోధన జెన్నా, సీనియర్ అసిస్టెంట్ జి. ప్రవీణ్ కుమార్, టైపిస్ట్ కె. వెంకటరావు, ల్యాబ్ అసిస్టెంట్ జి. వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.