ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో ఉత్తరాయణం పుణ్యకాలం సమయమైన మార్చి 9, 10 తేదీల్లో శ్రీ సూర్య నారాయణ స్వామి వారిని సూర్య కిరణాలు తాకుతాయని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. ఈ సమయంలో బంగారు ఛాయాలో స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారని ఈ సమయంలో స్వామిని దర్శించుకుంటే కంటి రుగ్మతలు, చర్మ రుగ్మతలు, ఆరోగ్య సమస్యలు నయమవుతాయని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa