కొమ్మాది శ్రీ అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణంలో రెండు రోజులు పాటు నిర్వహించిన శ్రీ త్యాగరాజ స్వామి ధ్యాన ఆరాధన ఉత్సవాలు ఆదివారం రాత్రి తో ముగిశాయి. ఆనందోబ్రహ్మ యూత్ ట్రస్టు, పిరుచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తముగా చేపట్టారు. ఈ ఉత్సవాల్లో ముఖ్య అతిథులుగా కూచిపూడి కళాక్షేత్రం ప్రిన్సిపల్ హరి రామమూర్తి, పిరమిడ్ సొసైటీ అధ్యక్షులు పివి రెడ్డి నాయుడు, కళాభిమాని కొణతాల రాజు, మాతృశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పోతిని శివ, ఆనందోబ్రహ్మ ఉపాధ్యక్షులు కే లక్ష్మీ ప్రసంగించారు. ఈ కార్యక్రమములో ప్రత్యేక ఆకర్షణగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన సంప్రదాయం కళాకారులు గురుకులానికి చెందినకళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు అధ్యంతం అలరించాయి. ఈ సందర్భముగా సాంప్రదాయం కూచిపూడి గురువు స్వాతి సోమనాథ్ హర్షాన్ని వ్యక్తం చేశారు.