ఉత్తర్‌ప్రదేశ్‌లోని నొయిడాలో భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఓ భర్త. యద్వేంద్ర అనే వ్యక్తికి 11 ఏళ్ల క్రితం వినీతతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే యద్వేంద్ర రోజు తాగి వచ్చి వినీతతో గొడవ పెట్టుకునేవాడు. ఈక్రమంలో తాజాగా మద్యం విషయంలో వివాదం తలెత్తింది. దీంతో ఆగ్రహించిన భర్త వినీతపై కిరోసిన్ పోసి నిప్పటించాడు. తీవ్రగాయాలపాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.