రోగనిరోధక శక్తి పెరగాలంటే వేడి నీటిలో అల్లం వేసుకుని తాగాలని నిపుణులు చెబుతున్నారు. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కీళ్ల నొప్పులు, ఇతర నొప్పులు తగ్గించే గుణం అల్లానికి ఉంది. ప్రతి రోజు అల్లం నీరు తాగితే షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుంచి త్వరగా కోలుకునేలా చేస్తాయి.