మార్చి, ఏప్రిల్ నెలల్లో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు తేదీలను ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. బుధవారం సీఎం వైయస్ జగన్ రెండు నెలల్లో అమలు చేసే కార్యక్రమాలు, పథకాలపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలు, మార్చి, ఏప్రిల్ నెలలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అమలుచేయాల్సిన పథకాల తేదీల ఖరారు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన పలు కార్యక్రమాలు. ఎన్నికల కోడ్ ముగియనుండడంతో ఈ కార్యక్రమాలు, పథకాల అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.