నూతన పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రావని నిలిచిపోనుందని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు తెలిపారు. స్థానిక పెదపాడు రోడ్ లోని క్యాంప్ ఆఫీసులో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమలను స్థాపించేందుకు ఉత్సాహవంతం అయిన పారిశ్రామిక వేత్తలను పిలిచారు. మన రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు, రాయితీలూ, లభ్యం అవుతున్న వనరులు, గనులు ఇలా అన్నింటినీ వివరించాం. ఈ సమావేశాన్ని భారదేశాన దిగ్గజ పారిశ్రామిక వేత్తలు వచ్చారు. మన విధానాలు చూశారు. ప్రబుత్వ నిజాయితీని గుర్తించారు. ఇక్కడ కల్పిస్తున్న సౌకర్యాలు చూశారు. తరువాత ఎంఓయూ లు చేసుకున్నారు. 13 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఎంఓయూలు చేసుకున్నారు. ఎక్కడైతే స్థిర మయిన ప్రభుత్వం స్థిరమయిన పారిశ్రామిక తోడ్పాటు అందిస్తుందో అక్కడే పెట్టుబడులు పెడతారు. ఆ విధంగా ఇదొక రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయం. ఇది రాష్ట్ర ప్రభుత్వ సారథి జగన్ మోహన్ రెడ్డి సాధించిన విజయమని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.