ఒంగోలు నగర పరిధిలోని పెళ్లూరులో అక్రమంగా నిల్వ ఉంచిన 280 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. పెళ్లూరులోని శ్రీ పద్మావతి ట్రేడర్స్‌కు చెందిన గోదాంకు రేషన్ బియ్యం తరలించి అక్కడ గోతాలు మార్చి విక్రయిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులకు సోమవారం సమాచారం అందింది. దీంతో వారు అక్కడికి వెళ్లి గోదాముపై దాడి చేశారు. రైస్ మిల్లు యజమాని మట్టా రాజా విచ్చలవిడిగా రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. 280 బస్తాల బియ్యంతోపాటు గోతాలను సీజ్ చేశారు. బియ్యాన్ని ఒంగోలు ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించారు. మట్టా రాజాపై 6ఏతోపాటు క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఒంగోలు తాలూకా పోలీసులకు విజిలెన్స్ అధికారులు సిఫారసు చేశారు. ఈదాడిలో విజిలెన్స్ సీఐ సుబ్బారావు, ఎస్ఐ వెంగళరెడ్డి, సింగరాయకొండ ఎన్ఫోర్స్మెంట్ డీటీ అశోక్ పాల్గొన్నారు.