పరిపాలనా రాజధాని విశాఖకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుకున్న సమయం కంటే ముందుగానే వస్తారని ఐటీ, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. సీఎం రాకకు ముహూర్తం ఎప్పుడు పెట్టారని మీడియా ప్రశ్నంచగా.. ఆయన ఇలా స్పందించారు. పెట్టుబడిదారుల సదస్సులో ఒప్పందాలు చేసుకున్న కంపెనీల్లో ప్రతి నెలా రెండునుంచి మూడు గ్రౌండింగ్ జరిగేలా చూస్తామని చెప్పారు. రాష్ట్రంలో వివాదాలు లేని 48 వేల ఎకరాల భూములను ఏపీఐఐసీ సేకరించి పెట్టిందన్నారు. మచిలీపట్నంలో పోర్టు నిర్మాణానికి 20 రోజుల్లో శంకుస్థాపన చేస్తామని తెలిపారు.