ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టుపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కేరళ ముఖ్యమంత్రి తన లేఖలో, “మనీష్ అరెస్టుపై కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా అనేక ప్రతిపక్ష పార్టీల నాయకులు లేవనెత్తుతున్న నిరసన స్వరాలపై ప్రధాని దృష్టిని ఆహ్వానించడానికి నేను ఈ లేఖ రాస్తున్నాను అని తెలిపారు. న్యాయం జరగడమే కాదు న్యాయం జరిగేలా చూడాలన్నది సహజ న్యాయం యొక్క బంగారు సూత్రం అని కేరళ ముఖ్యమంత్రి లేఖలో పేర్కొన్నారు.మనీష్ సిసోడియా ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి అని, వారి సమన్లకు ప్రతిస్పందనగా దర్యాప్తు సంస్థల ముందు హాజరవుతున్నారని విజయన్ చెప్పారు.