ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో విషాదం చోటుచేసుకుంది. బి ఫార్మసీ విద్యార్థి తనూజ్ నాయక్ (19) ఈ నెల 1న కబడ్డీ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. బెంగళూరులోని రామయ్య ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తనూజ్ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో తనూజ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం అచ్చంపల్లి గ్రామానికి చెందిన తనూజ్ నాయక్ పీవీకేకే కాలేజీలో బీఫార్మసీ చదువుతున్న తనూజ్ నాయక్ తన కొడుకు అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.