ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రసవత్తరంగా బల ప్రదర్శన పోటీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2023, 06:23 PM

శ్రీకాకుళం జిల్లా, వడ్డినవలసలో మంగళవారం బల ప్రదర్శన పోటీలు రసవత్తరంగా సాగాయి. త్రినాథస్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఇప్పిలి గణపతిరావు మాస్టారు జ్ఞాపకార్థం బంపర్సు, సంగిడి, విసురుగుండు పోటీలు నిర్వహించారు. సంగిడి పోటీల్లో వప్పంగి గ్రామానికి చెందిన గేదెల సత్యనారాయణ ప్రథమ, నిమ్మాడ గ్రామానికి చెందిన ఆవల గోవిందరావు ద్వితీయ స్థానం పొందారు.విసురుడు గుండు పోటీల్లో వప్పంగి గ్రామానికి చెందిన గేదెల సత్యన్నారాయణ ప్రథమ, చింతువానిపేటకు చెందిన ఆవల వసంతరావు ద్వితీయ స్థానం సాధించాడు. బంపర్సు పోటీల్లో మహిళా విభాగంలో బి.రాజ్యలక్ష్మి ప్రథమ, జి.వర్షిత ద్వితీయ స్థానం సాధించారు. విజేతలకు ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు బహుమతులు అందజేశారు. పరిసర గ్రామాలకు చెందిన వారు అధికసంఖ్యలో హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa