ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూమికన్నా ఎక్కువ భారం మహిళలపై ఉంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2023, 06:24 PM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం  సందర్భంగా టీడీపీ యువనేత నారా లోకేష్  శుభాకాంక్షలు తెలిపారు. పీలేరు నియోజకవర్గంలో పాదాయత్ర చేస్తున్న ఆయన బుధవారం ఉదయం మహిళలతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మహిళలకు పాదాభివందనం చేశారు. లోకేష్ మాట్లాడుతూ... ‘‘అమ్మలేనిది జన్మ లేదు. భూమికన్నా ఎక్కువ భారం మహిళలపై ఉంది. అలాంటి మహిళా దినోత్సవం ఈరోజు జరుపుకోవడం నాకు సంతోషంగా ఉంది’’ అంటూ సమావేశానికి వచ్చిన మహిళలకు లోకేష్  పాదాభివందనం చేశారు. మహిళలకు లోకేష్  ఇచ్చిన గౌరవం పట్ల నారీమణులు హర్షం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa