రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు లక్షల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్. తులసి రెడ్డి అన్నారు. బుధవారం రాయచోటిలోని స్థానిక పార్టీ కార్యాలయంలో నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వలన ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్తామన్నారు. సమావేశంలో పార్టీ నియోజకవర్గ బాధ్యులు అల్లాబకష్, గౌస్, ఖాదర్ ఖాన్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.