ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఫొటో గుర్తింపు కార్డు తప్పని సరిఅని ఎన్నికల సూక్ష్మ పరిశీలకుడు కోన శశి ధర్ పేర్కొన్నారు. రాయచోటి కలెక్టరేట్ ని వీసీ హాల్లో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలింగ్ కేంద్రంలోకి ఎటు వంటి ద్రవపదార్థాలు తీసుకెళ్లకూడదన్నారు. సూక్ష్మ అబ్జర్వర్లు ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు అయినందుకు గర్వంగా భావించాలన్నారు. ఎన్ని కల నిర్వహణపై అబ్జర్వర్లు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలన్నారు. కలెక్టర్ గిరీషా మాట్లాడుతూ పోలింగ్ ఏజెంట్లు ఫొటో గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. పోలింగ్ అధికారులు, ఏజెంట్లు, ఎన్నికల సంఘం అధీకృత వ్యక్తులు, ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు వంటి నిర్ధిష్ట వ్యక్తులను మాత్రమే పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు.