కృష్ణా జిల్లా, పెనమలూరు హాస్టల్లో ఇనుప తీగపై ఆరేసిన దుస్తులు తీసుకుంటుండగా విద్యుత్ షాక్తో విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాద ఘటన కానూరులోని ఓ కార్పొరేట్ పాఠశాలలో జరిగింది. విద్యార్థి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశరావు పాలేనికి చెందిన మద్దిపాటి కాశీవిశ్వ నాథ్ కుమారుడు జస్వంత్ శివసాయి(16) కానూరులోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం రాత్రి పదకొండు గంటల సమయంలో స్టడీ అవర్స్ ముగిశాక హాస్టల్ కారిడార్లో ఉన్న ఏసీ అవుట్పుట్ వద్ద ఇనుపతీగపై ఆరేసిన దుస్తులు తీసుకుంటుండగా ఇనుప తీగకు కరెంటు ప్రసరించి, విద్యుత్ షాక్ తగిలింది. దీంతో శివ సాయి కిందపడిపోయాడు. అప్రమత్తమైన వార్డెన్ దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. విద్యార్థి మృతి చెందిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.