వేసవిలో ఎండ, దురద, చెమట వల్ల జుట్టు పొడిబారుతూ ఉంటుంది. ఫలితంగా నిర్జీవంగా తయారై బాధపెడుతుంటుంది. ఈ సమయంలో మెంతులు జుట్టుకు మేలు చేస్తాయి. వీటిలోని ప్రొటీన్లు, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. పావుకప్పు మెంతుల్ని నానబెట్టి ఆరబెట్టాక పొడి చేసి దాన్ని కొబ్బరి నూనెలో మరగనివ్వాలి. ఈ నూనెను తలకు పట్టించి గంట తర్వాత స్నానం చేస్తే మీ జుట్టు సిల్కీగా, హెల్తీగా ఉంటుంది.