ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఆరోపణలపై బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘‘అరవింద్ కేజ్రీవాల్ రహస్యాలు ఆయన సన్నిహితుడైన మనీశ్ సిసోడియాకు బాగా తెలుసు. సీక్రెట్లు బయటపడకుండా సిసోడియాను చంపేందుకు కేజ్రీవాల్ కుట్ర పన్నుతున్నారా?’’ అని బీజేపీ ఎంపీ మనోజ్ తివారి ప్రశ్నించారు. ఢిల్లీ సర్కారు పరిధిలోనే జైలు ఉందన్నారు.