ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సామాజిక న్యాయంలో టీడీపీ మాటలకే పరిమితం: సజ్జల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 09, 2023, 06:28 PM

సాజిక న్యాయం విషయంలో గత ప్రభుత్వం మాటలకే పరిమితమైందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఎందుకు ఇన్ని అవకాశాలు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెనుమత్స సురేష్‌, కోలా గురువులు, ఇజ్రాయిల్‌, మర్రి రాజశేఖర్‌, జయమంగళ వెంకట రమణ, పోతుల సునీత, చంద్రగిరి యేసురత్నం గురువారం నామినేషన్లు దాఖలు చేశారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థులతో కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సామాముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సామాజిక సాధికారతను చేతల్లో చేసి చూపిస్తున్నారని పేర్కొన్నారు. మూడున్నరేళ్ల పాలనలో సీఎం జగన్ రాష్ట్రంలో సామాజిక విప్లవం తీసుకొచ్చారని సజ్జల చెప్పుకొచ్చారు.


18 ఎమ్మెల్సీ స్థానాల్లో 14 స్థానాలను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇందులో 11 స్థానాలు బీసీలకు కేటాయించడం చరిత్రాత్మకమన్నారు. రాజకీయ సాధికారత దిశగా సీఎం జగన్‌ ముందుకెళ్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్‌ పెద్దపీట వేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com