అమ్మ మందలించడంతో ఓ డిగ్రీ విద్యార్థిని చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసు కథనం ప్రకారం ఏలూరు స్థానిక అశోక్‌నగర్‌కు చెందిన బొబ్బిలి రాజ్యలక్ష్మి(17) డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. పరీక్షల సమయంలో మొబైల్ అతిగా చూస్తుండడంతో తల్లి మందలించింది. దీంతో కోపంగా గదిలోకి వెళ్లి ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటిలో పనులు పూర్తి చేసుకుని తల్లి వచ్చేసరికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వా సుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.