కర్నూలు టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రైల్వేస్టేషన్ సమీపంలో ఓ ఆటోలో వెళ్తున్న హరిత అనే మహిళ బంగారం చోరీకి గురైంది. హైదరాబాదుకు చెందిన హరిత స్థానిక పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసి ఆ ఇంటర్వ్యూకు హాజరైంది. ఇంటర్వ్యూ ముగించుకుని తిరిగి ఆటో ఎక్కింది. అంతకుముందే ఓ పెళ్లికి హాజరై తాను తెచ్చుకున్న బ్యాగులో నక్లెస్‌ను ఉంచింది. ఆటోలో రైల్వేస్టేషన్‌కు వెళ్లిన తర్వాత బ్యాగను పరిశీలిస్తే.. బ్యాగులో ఉన్న నక్లెస్ మాయమైనట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించింది. అపహరణకు గురైన నక్లెస్ 4 తులాలు ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.