‘‘ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు, అందులోనూ బీజేపీని విమర్శించినవాళ్లే అవినీతిపరులైనట్టు వారిపై దాడులు చేయడం అభ్యంతకరం. ఏపీలోనూ చాలా కుంభకోణాలు, కేసులు ఉన్నాయి. వాటి గురించి ఎక్కడా మాట్లాడరే?’’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత, సిసోడియా అంశాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ఎవరైనా కానీ నిర్దిష్టమైన తప్పులు చేసినవారిపై చర్యలు తీసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు. అలాంటి అవినీతిని సమర్థించే పార్టీ తమది కాదన్నారు. శుక్రవారం విజయవాడలో పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే తీవ్రఅవినీతి ఉందని ఆరోపించారు.