ఓ విదేశీ యువతిని బెదిరించి గత ఆరేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న దారుణ ఘటన ముంబైలో వెలుగుచూసింది. మనీష్ గాంధీ అనే వ్యక్తి పోలండ్ కు చెందిన యువతి నగ్న ఫోటోలు సేకరించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి 2016-22 మధ్య పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు అంబోలీ పోలీసులు కేసు నమోదు చేసుకొని మనీష్ గాంధీ కోసం గాలింపు చేపట్టారు.