రేపు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు సహకరించాలని ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి అన్నారు. ఆదివారం కందుకూరు పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. తూర్పు రాయలసీమ పరిధిలో ఉన్న కందుకూరు నియోజకవర్గం లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు రెవిన్యూ, పోలీస్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. పట్టబద్రులు, ఉపాధ్యాయులు అధిక శాతం పోలింగ్ లో పాల్గొని తమ ఓటు వేయాలని కోరారు.