గంటకో కులం అనే వ్యక్తి పవన్ అని.. మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్‌ది సెలబ్రిటీ పార్టీ అని విమర్శించారు. తెలంగాణలో 26 కులాలను బీసీ బాబితా నుంచి తొలగిస్తే తాము ప్రశ్నించామని.. పక్కరాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై పవన్ ఎందుకు మాట్లాడరని నిలదీశారు. నిర్దుష్టమైన లక్ష్యం ఉంటే నీతి.. నిజాయితీతో పోరాడాలని బొత్స హితవు పలికారు.
'సినిమాల్లో రాక్షసుల మాదిరిగా కొందరు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారు. పవన్ వల్ల కాపులకు ఎలాంటి మేలు జరగలేదు. గతంలో ఎప్పుడైనా రాజ్య సభ, ఎమ్మెల్సీ టికెట్లు బీసీలకు ఇచ్చారా. ఓడిపోయే స్థానంలో వర్ల రామయ్య.. గెలుస్తుందని అనుకునే స్థానాల్లో సీఎం రమేష్ లాంటి నాయకులకు టీడీపీ టికెట్‌లు ఇచ్చింది. సెలబ్రిటీ పార్టీ నాయకుడు పవన్ వల్ల కాపులకు ఏమైనా మేలు జరిగిందా' అని మంత్రి బొత్స ప్రశ్నించారు.
ఇటు జనసేనలో చేరికలు ప్రారంభమయ్యాయి. పవన్ కళ్యాణ్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యేలు టీవీ రామారావు, ఈదర హరిబాబు జనసేనలో చేరారు. పలువురు భీమిలి వైసీపీ నేతలు కూడా జనసేన కండువా కప్పుకున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత ఇవే కీలక చేరికలు అని నేతలు చెబుతున్నారు. టీవీ రామారావు, ఈదర హరిబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. వీరే కాకుండా.. త్వరలోనే మరికొందరు కీలక నేతలు జనసేనలో చేరే అవకాశం ఉంది.