మన దేశంలో గొర్రెలు, మేకల పెంపకందారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ పథకం ద్వారా భారీ మొత్తంలో సబ్సిడీలను ప్రకటించింది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం లేదా గరిష్టంగా రూ.50 లక్షలకు మించకుండా సబ్సిడీ లభిస్తుంది. ఈ పథకంపై ఆసక్తి కలిగినవారు www.nlm.udyamimitra.in ద్వారా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పథకం పూర్తి వివరాలు కూడా పైన తెలిపిన వెబ్ సైట్ లో చూడవచ్చు.