నరసరావుపేట నియోజకవర్గం నరసరావుపేట పట్టణంలో సోమవారం సాయంత్రం ఐదు గంటలకు పట్టణంలోని 34 వార్డులోని బీసీ కాలనీలో ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించనున్నట్లు నరసరావుపేట టిడిపి నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నరసరావుపేట టిడిపి ఇన్చార్జి చదలవాడ అరవింద్ బాబు హాజరుకానున్నారన్నారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.