జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగు ప్రశాంతంగా జరుగుతోందని సహాయ ఎన్నికల అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ పేర్కొన్నారు. పియస్ యన్ఎం స్కూల్ లోని 52, 53 పోలింగ్ కేంద్రాలను ఆయన సోమవారం పరిశీలించారు. బ్యాలెట్ బాక్సులను ఆయన పరిశీలించి, బాక్సు పరిశీలించి ఓట్లతో పూర్తిగా నిండిపోతే మరోబాక్సును మార్చాలని ప్రెసైడింగ్ అధికారులను ఆదేశించారు. పట్టబధ్రులు 59 పోలింగ్ కేంద్రాలు, స్థానిక సంస్థలు 4 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోందన్నారు. పోలింగ్ ప్రశాంతంగా, శాంతి యుతంగా జరుగుతుందని, జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేవన్నారు. పోలింగ్ శాతం ఎంత వరకు జరిందని పోలింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.